తెలంగాణలో మరో 4,693 కరోనా కేసులు, 33 మరణాలు

  • తెలంగాణలో నియంత్రణలోకి వస్తున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 71,221 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 734 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇంకా 56,917 మందికి చికిత్స
తెలంగాణలో గత కొన్నిరోజులుగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 71,221 కరోనా టెస్టులు నిర్వహించగా 4,693 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన కేసులే ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 734 కొత్త కేసులు గుర్తించారు. రాష్ట్రంలో తాజాగా 6,876 మంది కోలుకోగా, 33 మంది మరణించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,16,404 మంది కరోనా బారినపడగా... 4,56,620 మంది మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. ఇంకా 56,917 మంది ఐసోలేషన్ లోనూ, ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో కరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా, తెలంగాణలో 0.55 శాతంగా నమోదైంది. అటు, రికవరీ రేటు చూస్తే దేశంలో 83.2 శాతం నమోదు కాగా, తెలంగాణలో 88.42 శాతంగా ఉంది.


More Telugu News