ఏపీలో కరోనా విలయతాండవం... మరోసారి 20 వేలకు పైగా కేసులు

  • గత 24 గంటల్లో 96,446 కరోనా పరీక్షలు
  • 22,399 మందికి పాజిటివ్
  • తూర్పు గోదావరి జిల్లాలో 3 వేలకు పైగా కొత్త కేసులు
  • రాష్ట్రంలో మరో 89 మంది మృతి
ఏపీలో కరోనా పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. మరోసారి 20 వేలకు పైన కొత్తకేసులు నమోదు కాగా, పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో 96,446 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,399 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 3,372 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,646 కేసులు, గుంటూరు జిల్లాలో 2,141 కేసులు, అనంతపురం జిల్లాలో 2,080 కేసులు, విశాఖ జిల్లాలో 2,064 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 18,638 మంది కరోనా నుంచి కోలుకోగా, 89 మంది మృత్యువాత పడ్డారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో 11 మంది చొప్పున మృతి చెందారు. ఏపీలో ఇప్పటిదాకా 13,66,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా 11,56,666 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,01,042 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 9,077కి పెరిగింది.


More Telugu News