అల్లాహ్ దీవెనలతో ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలి: జగన్
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జగన్
- ధార్మిక చింతన, దాతృత్వం, క్రమశిక్షణల కలయికే రంజాన్ అని వ్యాఖ్య
- సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు
రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ఏపీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నుంచి బయటపడి అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు. ధార్మిక చింతన, దాతృత్వం, క్రమశిక్షణల కలయికే రంజాన్ అని చెప్పారు.
పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులందరూ నెల రోజుల నుంచి కఠోర ఉపవాస దీక్షలను నిష్టగా ఆచరిస్తూ, అల్లాహ్ ను ఆరాధిస్తూ, ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తారని అన్నారు. అల్లాహ్ కరుణ, రక్షణ పొందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని చెప్పారు. ధనిక, బీద అనే భేదం లేకుండా ఉన్నదానిలో ఎంతో కొంత దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు.