ఏపీ మంత్రి వెల్లంపల్లికి పితృవియోగం

  • వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం
  • అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రి సూర్యనారాయణ
  • విజయవాడలో నేడు అంత్యక్రియలు
  • వెల్లంపల్లికి సంతాపం తెలిపిన సహచర మంత్రులు
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి  వెల్లంపల్లి  సూర్యనారాయణ (80) ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  సూర్యనారాయణ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు అప్పలరాజు, మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాపం తెలియజేశారు. కాగా, వెల్లంపల్లి తండ్రి అంత్యక్రియలు విజయవాడ భవానీపురం పున్నమిఘాట్ హిందూ శ్మశాన వాటికలో నేడు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సూర్యనారాయణ భౌతికకాయాన్ని మంత్రి వెల్లంపల్లి నివాసం వద్ద ఉంచారు.


More Telugu News