అసైన్డ్ భూముల్లోని గుడిసెలకు నిప్పు.. నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత
- వరంగల్ గ్రామీణ జిల్లాలోని కాకతీయ నగర్ వద్ద ఘటన
- మంటలు అంటుకుని 50 గుడిసెలు దగ్ధం
- నెల రోజుల క్రితం అసైన్డ్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలు
- మొత్తం 200 గుడిసెలు వేసుకున్న పేదలు
- తమ భూముల్లో వేసుకున్నారని పేదలపై వెంకటయ్య అనే వ్యక్తి దాడి
వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట కాకతీయ నగర్ వద్ద అసైన్డ్ భూముల్లో కలకలం చెలరేగింది. అక్కడి గుడిసెలకు బైరబోయిన వెంకటయ్య అనే వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు నిప్పు పెట్టడంతో, 50 గుడిసెలు దహనమయ్యాయి.
ఆ ప్రాంతంలోని అసైన్డ్ భూముల్లో నెల రోజుల క్రితం పేదలు గుడిసెలు వేసుకున్నారు. అక్కడ మొత్తం 200 గుడిసెల్లో పేదలు నివాసం ఉంటున్నారు. తమ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని పేదలపై వెంకటయ్య కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డాడు. వారు గుడిసెలకు నిప్పు పెడుతోన్న సమయంలో అడ్డుకున్న గుడిసెవాసులపై దాడులకు దిగుతూ రెచ్చిపోయారు.
వెంకటయ్య కుటుంబ సభ్యుల దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. చివరకు గుడిసెవాసులంతా కలిసి 10 మంది నిందితులని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.