ఈ కుక్క ఆచూకీ చెబితే రూ.లక్ష ఇస్తాం: హీరోయిన్ నిధి అగర్వాల్
- కుక్క ఫొటో పోస్ట చేసిన నిధి
- ఫోను నంబరుకు కాల్ చేయాలని సూచన
- లక్ష ఆఫర్ ఇచ్చిన పోస్ట్ వైరల్
హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఓ పోస్ట్ చేస్తూ తమ కుక్క తప్పిపోయిందని, దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. ఆ కుక్క ఫొటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు ఫోను చేయాల్సిన నంబరును ఆమె పోస్ట్ చేసింది.
కుక్క ఆచూకీ చెబితే ఏకంగా లక్ష రూపాయలు ఇస్తామని ఆమె చేసిన పోస్టు వైరల్ అవుతోంది. పూరీ జగన్నాథ్-రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మెప్పించిన నిధి అగర్వాల్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
టాలీవుడ్‌లోనే కాకుండా తమిళంలోనూ నిధి అగర్వాల్ పలు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో గల్లా అశోక్ హీరోగా నటిస్తోన్న సినిమాతో పాటు, పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'హరి హర వీర మల్లు' సినిమా కూడా ఉంది.