తనపై కేసును కొట్టివేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. కుదరదన్న హైకోర్టు
- నామినేషన్‌లో కేసుల విషయాన్ని దాచిపెట్టిన పార్థసారథి
- విచారణ అనంతరం విజయవాడ మొదటి ఎంఎం కోర్టులో ఈసీ ఫిర్యాదు
- ప్రత్యేక న్యాయస్థానానికి కేసును బదిలీ చేసిన కోర్టు
- పార్థసారథి అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం
ప్రత్యేక కోర్టులో తనపై జరుగుతున్న విచారణను కొట్టివేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రత్యేక న్యాయస్థానానికి కేసును విచారించే పరిధిలేదన్న కారణంతో దానిని కొట్టివేయలేమని స్పష్టం చేసింది. అయితే, తనపై అభియోగం మోపిన నాటికి ఎమ్మెల్యే, ఎంపీని కాదని కాబట్టి ఆ కేసును ప్రత్యేక న్యాయస్థానం విచారించడానికి వీల్లేదన్న పార్థసారథి వాదనతో ఏకీభవించిన కోర్టు.. కేసు విచారణను విజయవాడలోని మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది.
2009 ఎన్నికల్లో పెనమలూరు శాసనసభకు పోటీ చేస్తూ పార్థసారథి నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాలను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో తనపై పెండింగులో ఉన్న రెండు కేసుల విషయాన్ని ఆయన తన నామినేషన్‌లో దాచిపెట్టారు. ఈ విషయమై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారించిన అధికారులు అది నిజమేనని నిర్ధారించి 24 సెప్టెంబరు 2012లో విజయవాడలోని మొదటి ఎంఎం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ కేసు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయింది. ఇప్పుడీ కేసు మరోమారు బదిలీ అయింది.