తెలంగాణలో బ్యాంకు పనివేళల్లో మార్పులు!

  • రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా
  • కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం
  • ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకే  బ్యాంకులు
  • 20వ తేదీ వరకు కొనసాగనున్న కొత్త పనివేళలు
తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంకుల పనివేళల్ని కుదించారు. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పనివేళలు కొనసాగనున్నాయి. అలాగే బ్యాంకులు కేవలం 50 శాతం మంది సిబ్బందితో మాత్రమే కార్యకలాపాలు సాగించనున్నాయి.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో మహమ్మారి కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పదిరోజులు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నేటి ఉదయం 10 గంటలకు లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. 20వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరకుల కొనుగోలు నిమిత్తం నాలుగు గంటల పాటు లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఉంటుంది.


More Telugu News