సి. రామచంద్రయ్య భార్యను ఎందుకు ప్రశ్నించడం లేదు?: టీడీపీ నేత బీటెక్ రవి
- గనుల లీజు రామచంద్రయ్య భార్య పేరు మీద ఉంది
- రామచంద్రయ్య కుటుంబం జోలికి వెళ్లొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారా?
- కోర్టులో ప్రైవేటు కేసు వేస్తాం
కడప జిల్లా మామిళ్లపల్లె వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో 10 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పెదనాన్న ప్రతాపరెడ్డి, ముగ్గురాయి గని యజమాని నాగేశ్వర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో అసలైన దోషులను వదిలేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
గనుల లీజుదారుగా వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య భార్య కస్తూరిబాయి పేరు ఉందని బీటెక్ రవి చెప్పారు. 2001 నుంచి 2022 వరకు లీజు పరిమితి ఉందని... ఈ గనిని నాగేశ్వర్ రెడ్డికి లీజుకు ఇచ్చారా? లేక ఇచ్చినట్టు సృష్టించారా? అని ప్రశ్నించారు. రామచంద్రయ్య కుటుంబం జోలికి వెళ్లొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారా? అని అడిగారు. పేలుళ్ల ఘటనకు రామచంద్రయ్య భార్యే కారణమని... ఆమెపై చర్యలు తీసుకోకపోతే, కోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు. మరోవైపు జిలెటిన్ స్టిక్స్ పులివెందుల నుంచి కలసపాడుకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.