ఏపీ సీఎం జగన్ కు అఖిల భారత న్యాయవాదుల సంఘం లేఖ

ఏపీ సీఎం జగన్ కు అఖిల భారత న్యాయవాదుల సంఘం లేఖ
  • తిరుపతి రుయా ఘటనపై దిగ్భ్రాంతి
  • దురదృష్టకరమని వ్యాఖ్యలు
  • పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్
  • ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉండేలా చూడాలని స్పష్టీకరణ
ఏపీలో ప్రస్తుత పరిణామాలపై అఖిల భారత న్యాయవాదుల సంఘం సీఎం జగన్ కు లేఖ రాసింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ నిలిచిపోయి 11 మంది మరణించడంపై న్యాయవాదుల సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రుయా ఆసుపత్రి ఘటన దురదృష్టకరం అని అభిప్రాయపడింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.

అటు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా రోగుల అంబులెన్స్ లు అడ్డుకుంటున్న అంశాన్ని కూడా న్యాయవాదుల సంఘం ప్రతినిధులు తమ లేఖలో ప్రస్తావించారు. కరోనా బాధితులను సరిహద్దుల్లో అడ్డుకోవడం అమానుషం అని పేర్కొన్నారు.


More Telugu News