భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 340 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 91 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- తీవ్ర ఒత్తిడికి గురైన ఫైనాన్స్, మెటల్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 340 పాయింట్లు కోల్పోయి 49,161కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు పతనమై 14,850కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.83%), ఓఎన్జీసీ (3.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.66%), సన్ ఫార్మా (1.48%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.85%).
టాప్ లూజర్స్;
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.95%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.54%), బజాజ్ ఫైనాన్స్ (-1.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.30%).