కరోనా చికిత్సలో ఐవర్​ మెక్టిన్​ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక!

  • దాని భద్రత, సమర్థతకు ఆధారాల్లేవని కామెంట్
  • మెర్క్ సంస్థ అధ్యయనాన్ని పోస్ట్ చేసిన చీఫ్ సైంటిస్ట్
  • రెండు నెలల్లో ఇది రెండో వార్నింగ్
కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై అప్పటికే ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమని పేర్కొంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినికల్ ట్రయల్స్  చేయకుండా ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని డబ్ల్యూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.

ఇటు జర్మనీకి చెందిన మెర్క్ అనే ఫార్మా సంస్థ కూడా ఇదే సూచన చేస్తోంది. తమ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఐవర్ మెక్టిన్ వాడకంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారని సంస్థ వెల్లడించింది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో కరోనాపై మందు ప్రభావం ఏమాత్రం లేదని తేలినట్టు తెలిపింది. భద్రత, ఔషధ సామర్థ్యంపైనా సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది.

మెర్క్ స్టడీ వివరాలను పోస్ట్ చేస్తూ సౌమ్య స్వామినాథన్ ఐవర్ మెక్టిన్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గత రెండు నెలల్లో ఐవర్ మెక్టిన్ పై డబ్ల్యూహెచ్ వో వార్నింగ్ ఇవ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కరోనాపై ఆ మందు పనితీరుపైన, దాని వల్ల మరణాలు తగ్గుతాయన్న దానిపైనా ఎలాంటి ఆధారాలూ లేవని ఇంతకుముందు ఆందోళన వ్యక్తం చేసింది.


More Telugu News