అద్దాల వంతెన నుంచి ఊడిపోయిన అద్దాలు.. 330 అడుగుల ఎత్తున గాల్లో వేలాడిన వ్యక్తి!
- చైనాలోని లాంగ్జింగ్ లో ఘటన
- 150 కిలోమీటర్ల వేగంతో గాలులు
- సురక్షితంగా తీసుకొచ్చిన బలగాలు
చుట్టూ పచ్చని కొండలు.. మధ్యలో 330 అడుగుల ఎత్తున రెండంచులను కలిపే అద్దాల వంతెన. దాని మీద నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తే వచ్చే ఆ మజాయే వేరు కదా! మజా పక్కన పెడితే.. మన ఖర్మ కాలి ఆ అద్దాలు ఊడిపోయాయనుకోండి.. ఆ గ్యాప్ లో మీరు వేలాడుతున్నారనుకోండి..! ఏంటి పరిస్థితి? ఏముంది గాల్లో వేలాడిన ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోతాయి కదా!
అచ్చంగా ఇదే జరిగింది చైనాకు చెందిన ఓ వ్యక్తికి. చైనాలోని లాంగ్జింగ్ లోని పియాన్ మౌంటెయిన్ కల్చరల్ టూరిజం సీనిక్ ఏరియా వద్ద ఉన్న అద్దాల వంతెన వద్ద శుక్రవారం జరిగిందీ ఘటన. ఓ టూరిస్ట్ అద్దాల వంతెనపై నడుస్తుండగా.. అకస్మాత్తుగా గాలి వీచింది. కొద్ది సేపట్లోనే గాలి వేగం 150 కిలోమీటర్లకు పెరిగింది.
ఆ ఈదురుగాలుల ధాటికి వంతెన అద్దాలన్నీ ఊడిపోయాయి. కంగారుపడిపోకుండా ఆ వ్యక్తి వెంటనే సమయస్ఫూర్తితో పక్కలకు పెట్టిన ఇనుప కడ్డీలను పట్టుకున్నాడు. కింద ఏ ఆధారమూ లేకపోవడంతో చాలా సేపు దానిని పట్టుకుని అలాగే వేలాడాడు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అతడిని కాపాడారు. ఈ ఘటన వివరాలను లాంగ్జింగ్ నగర పాలక సంస్థ చైనా సామాజిక మాధ్యమ సైట్ అయిన వీబోలో పోస్ట్ చేసింది.