జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించండి: నిర్మలకు కేంద్ర మాజీ కార్యదర్శి లేఖ
- వ్యాక్సినేషన్ విషయంలో విఫలమయ్యాం
- తొలి దశ నుంచి ప్రభుత్వం ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు
- ఇప్పటికైనా స్పందించకుంటే తీవ్ర పరిస్థితులు
దేశంలో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారిపై పోరాడేందుకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కోరుతూ కేంద్ర మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. వ్యాక్సినేషన్ విషయంలో మనం పూర్తిగా విఫలమయ్యామని, ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించినా, లేకున్నా అది నిజమని పేర్కొన్నారు. కరోనా తొలి దశ నుంచి ప్రభుత్వం ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదని, ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే ప్రమాదమని హెచ్చరించారు. బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లకపోతే విపరీత పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ లేఖలో శర్మ హెచ్చరించారు.