విశాఖకు ఆక్సిజన్ ట్యాంకర్లు మోసుకొచ్చిన ఐరావత్ నౌక
- ఈ నెల 5న సింగపూర్ నుంచి బయలుదేరిన నౌక
- అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ ట్యాంకర్లు
- సముద్రసేతు-2 కార్యక్రమంలో 9 నౌకలు
ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు, అత్యవసర ఔషధాలతో సింగపూర్ నుంచి ఈ నెల 5న బయలుదేరిన భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ నిన్న విశాఖపట్టణం చేరుకుంది. నౌక మోసుకొచ్చిన వాటిలో 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు, కొవిడ్ మందులు ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు.
దేశంలో కరోనాతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు తూర్పు నావికాదళం సముద్రసేతు-2 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలివెళ్లాయి. అందులో ఐరావత్ ఒకటి. వివిధ దేశాల నుంచి సేకరించిన ద్రవ ఆక్సిజన్, కొవిడ్ ఔషధాలను సేకరించి భారత్ కు తరలిస్తున్నారు.