బెంగాల్ బీజేపీ నేతలకు ‘ఎక్స్’, ‘వై’ కేటగిరీ భద్రత

  • బెంగాల్‌లో అల్లర్ల అనంతరం కేంద్ర బలగాల నివేదిక
  • 61 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ‘ఎక్స్’ కేటగిరీ భద్రత
  • మిగతా వారికి ‘వై’ కేటగిరీ భద్రత
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింస నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో జరిగిన అల్లర్ల అనంతరం కేంద్ర బలగాలు, ఇతర సీనియర్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా బీజేపీ నేతలకు భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

కొత్తగా ఎన్నికైన 77 మంది ఎమ్మెల్యేలకు సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ దళాలతో భద్రత కల్పించాలని హోంశాఖ వర్గాలు నిర్ణయించాయి. 77 మందిలో 61 మందికి ‘ఎక్స్’ కేటగిరీ భద్రత లభించనుండగా, మిగతా వారికి ‘వై’ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన సువేందు అధికారికి ఇప్పటికే ‘జడ్’ కేటగిరీ భద్రత ఉండడంతో అదే కొనసాగే అవకాశం ఉందని సమాచారం.


More Telugu News