పదో తరగతి ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు

  • తెలంగాణలో కరోనా తీవ్రం
  • పదో తరగతి పరీక్షలు రద్దు
  • పరీక్షల అనంతర ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం
  • ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు
  • పరీక్ష ఫీజు చెల్లించిన వారందరూ పాస్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల వెల్లడికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. పరీక్షల అనంతర ప్రక్రియలకు ప్రభుత్వ పరీక్షల విభాగం శ్రీకారం చుట్టింది. ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం మార్కుల అప్ లోడింగ్, గ్రేడింగ్ ప్రక్రియ జరుగుతోంది. మార్కులు అప్ లోడ్ పూర్తికాగానే ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ, పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ పాస్ అని వెల్లడించింది. కాగా, గతేడాది కూడా ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే ఫలితాలు వెల్లడించారు.


More Telugu News