సెంట్రల్ విస్టాకు కేటాయించిన నిధులతో 62 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సమకూర్చుకోవచ్చు: ప్రియాంక గాంధీ

  • సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల కేటాయింపు
  • కరోనా ఉద్ధృతిలోనూ ముందుకెళ్తున్న కేంద్రం
  • విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
  • నిధుల్ని ఆరోగ్యసంరక్షణా వ్యవస్థలకు కేటాయించాలని ప్రియాంక హితవు‌
కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంటు భవనానికి సంబంధించిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లడంపై కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.20 వేల కోట్లను వైద్యారోగ్య, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థల బలోపేతానికి ఉపయోగించాలని హితవు పలికారు.

ఈ నిధులతో అనేక వసతులు ఏర్పాటు చేయవచ్చంటూ ఆ జాబితాను ఆమె ట్విటర్‌ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రధాని నివాసం, సెంట్రల్ విస్టా నిర్మాణానికి కేటాయించిన ‘‘రూ. 20వేల కోట్లు = 62 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు = 22 కోట్ల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ = 3 కోట్ల 10 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్లు = 12వేల పడకలతో కూడిన 13 ఎయిమ్స్‌’’ను సమకూర్చుకోవచ్చని ప్రియాంక అభిప్రాయపడ్డారు.


More Telugu News