ఆర్టికల్ 370పై మాట మార్చిన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ
- ఆర్టికల్ 370 భారత్ అంతర్గత వ్యవహారమని రెండ్రోజుల క్రితం చెప్పిన ఖురేషీ
- ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ పాక్ విపక్ష పార్టీలు
- కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కాదని మాట మార్చిన ఖురేషీ
ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ రెండ్రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ లో అగ్గి రాజేశాయి. విపక్ష పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. ఖురేషీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
దీంతో, ఖురేషీ తాజాగా మాట మార్చారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అజెండాలో కూడా జమ్మూకశ్మీర్ ను అంతర్జాతీయ వివాదంగా పరిగణించారని చెప్పారు. కశ్మీర్ కు సంబంధించిన ఏ అంశం కూడా భారత్ అంతర్గత విషయం కాదని అన్నారు.