ఏపీ నుంచి కరోనా రోగులతో వచ్చే అంబులెన్సులను వెనక్కి పంపుతోన్న తెలంగాణ పోలీసులు
- ఏపీ నుంచి కొవిడ్ రోగులకు అనుమతి లేదు
- సూర్యాపేట జిల్లా రామాపురంలో తనిఖీలు
- కర్నూలు జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద కూడా
- కరోనా రోగులతో వచ్చే అంబులెన్సుల అడ్డగింత
కరోనాకు చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే కరోనా రోగులను పోలీసులు అనుమతించట్లేదు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకుని, వాటిని వెనక్కి పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా రోగులను తెలంగాణలోకి అనుమతించట్లేదని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇతర వాహనాలను మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు.
హైదరాబాద్‌లో కరోనా చికిత్సల కోసం ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సౌకర్యాలు లేవని పోలీసులు అంటున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న కర్నూలు పోలీసులు పుల్లూరు టోల్గేట్ వద్దకు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. తమ ఆసుపత్రులలో పడకలు ఉన్నాయని, చేర్చుకుంటామని ఆయా ఆసుపత్రులు హామీ ఇస్తే కనుక అంబులెన్స్‌లను తెలంగాణలోకి విడిచిపెడుతున్నారు.