హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్.. విడుదల
- రెండు రోజులుగా చంద్రబాబును కలిసేందుకు యత్నం
- కడప జిల్లా చక్రంపేట వాసిగా గుర్తింపు
- కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందన్న వ్యక్తి
- చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని పోలీసుల హామీ
హైదరాబాదులోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని నిన్న జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించిన అనంతరం అతడిని విడిచిపెట్టారు. తనది కడప జిల్లా రాజంపేట మండలం చక్రంపేట అని, తన పేరు సుబ్బారెడ్డి (40) అని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.
తమ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, తన తండ్రి, సవతి తల్లి, వారి కుమారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తనకు సాయపడమని కోరేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నట్టు పోలీసులకు తెలిపాడు. దీంతో అతడి నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు.. విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి, అతనిని స్వగ్రామానికి పంపించారు.