చంద్రబాబుపై క్రిమినల్ కేసు హాస్యాస్పదం: అయ్యన్నపాత్రుడు
- ఎన్440కే వైరస్ పై ప్రచారం
- కర్నూలులో చంద్రబాబుపై కేసు నమోదు
- చంద్రబాబు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్న అయ్యన్న
- ఆయనపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రమాదకర ఎన్440కే కరోనా వేరియంట్ వ్యాపిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కర్నూలులో కేసు నమోదు కావడం తెలిసిందే. కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వొకేట్ సుబ్బయ్య ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
కొత్త రకమైన ఎన్440కే ఉనికిని కనుగొన్నట్టుగా సీసీఎంబీ నిర్ధారించిందని అయ్యన్న వెల్లడించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించాయని వివరించారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టడం హాస్యాస్పదం అని విమర్శించారు. పేద ప్రజల పక్షాన పోరాడాల్సిన న్యాయవాది వైసీపీ నేతలకు కొమ్ము కాయడం తగునా? అని ప్రశ్నించారు.