ఏపీలో కొనసాగుతున్న కరోనా బీభత్సం... 92 మంది మృత్యువాత
- రాష్ట్రంలో కరోనా మృత్యుఘంటికలు
- తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది మృతి
- ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాల నమోదు
- 8,707కి చేరిన కరోనా మృతుల సంఖ్య
- గత 24 గంటల్లో 22,164 కొత్త కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 92 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,707కి పెరిగింది.
ఇక తాజాగా రాష్ట్రంలో 1,05,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,164 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2,844 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 18,832 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 12,87,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,88,264 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,90,632 మంది చికిత్స పొందుతున్నారు.