మాతృ దినోత్సవం వేళ సుదర్శన్‌ పట్నాయక్‌ వినూత్నంగా సైక‌త శిల్పం

  • క‌రోనా జాగ్ర‌త్త‌లు గుర్తు చేస్తూ సైక‌త శిల్పం
  • చూపరులను  ఆకట్టుకుంటోన్న సుద‌ర్శ‌న్ ప్ర‌తిభ‌
  • హ్యాపీ మ‌ద‌ర్స్ డే అంటూ రూపొందించిన ప‌ట్నాయ‌క్
మాతృ దినోత్సవం వేళ  సైక‌త క‌ళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ వినూత్నంగా సైక‌త శిల్పం రూపొందించారు. ఒడిశాలోని పూరీ తీరంలో రూపొందించిన‌ ఈ  సైక‌త శిల్పం  చూపరులను  ఆకట్టుకుంటోంది. దీన్ని సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. హ్యాపీ మ‌ద‌ర్స్ డే అని రాసి  ఉన్న ఈ సైక‌త శిల్పంలో ఐ ల‌వ్ మై మ‌ద‌ర్ అని కూడా రాస్తూ క‌రోనాకు సంబంధించిన జాగ్ర‌త్త‌ల‌ను కూడా సుద‌ర్శ‌న్ ప‌ట్నాయక్ గుర్తు చేశారు.
    
మాస్కులు ధ‌రించ‌డం, ప‌రిశుభ్ర‌త పాటించ‌డం వంటి అంశాల‌తో పాటు పిల్ల‌ల ప‌ట్ల‌ తల్లి తీసుకునే జాగ్ర‌త్త‌ల‌ను ఈ సైక‌త శిల్పం ద్వారా ఆయ‌న చూపించారు. క‌రోనా వేళ అంత‌ర్జాతీయ‌ మాతృ దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆయ‌న రూపొందించిన  ఈ సైక‌త శిల్పం అద్భుతంగా ఉందంటూ ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.



More Telugu News