వెంటిలేటర్లపై 1,70,841 మంది.. ఆక్సిజన్ సపోర్ట్‌పై 9,02,291 మంది: కేంద్రం

  • గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సమావేశం
  • కొవిడ్ పరిస్థితిపై చర్చ
  • ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన, ఆక్సిజన్ ఉత్పత్తిపై చర్చ
దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు నిన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)తో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్)  పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దేశంలోని మొత్తం కరోనా రోగుల్లో 1.34 శాతం మంది (4,88,861) ఐసీయూలో చికిత్స పొందుతుండగా, 0.39 శాతం మంది (1,70,841) రోగులు వెంటిలేటర్లపై ఉన్నట్టు తెలిపారు. 3.70 శాతం మంది (9,02,291) మంది ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స పొందుతున్నట్టు వివరించారు.

దేశీయంగా ఆక్సిజన్ ఉత్పత్తిని 9,400 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాపై ఆయా శాఖల మంత్రులు వివరించారు.


More Telugu News