చంద్రబాబుపై కేసు కక్ష సాధింపే: రామకృష్ణ
- వైరస్ వ్యాప్తిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేసు
- ప్రజలను అప్రమత్తం చేయడమే చంద్రబాబు తప్పా అని ప్రశ్నించిన రామకృష్ణ
- రాష్ట్రంలోని కరోనా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసుల బనాయింపు కక్ష సాధింపేనని, దీనిని ఖండిస్తున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ మెప్పు పొందేందుకే హేమంత్ సోరెన్ ట్వీట్‌పై జగన్ స్పందించారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కారణంగా సంభవించిన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
కాగా, ఏపీలో ఎన్440కె రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అందిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. దీనిపై శాస్త్రీయంగా దర్యాప్తు జరిపిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, చంద్రబాబు అరెస్ట్‌పై దర్యాప్తు అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారని ఫకీరప్ప తెలిపారు.