స్వప్రయోజనాల కోసమే ఏపీ సీఎం జగన్ ఆ ట్వీట్ చేశారు: జేఎంఎం 

  • ప్రధాని మోదీ సీఎంల మాట వినిపించుకోవడంలేదన్న సొరెన్
  • ప్రధానికి అందరూ అండగా నిలవాలన్న సీఎం జగన్
  • సీఎం జగన్ వ్యాఖ్యలపై జేఎంఎం ఆగ్రహం
  • బీజేపీకి దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపణ
కరోనా పరిస్థితులపై సీఎంలతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ వ్యాఖ్యానించగా, కరోనా కష్టకాలంలో ప్రధానికి అందరూ అండగా నిలవాలని, రాజకీయాలకు ఇది సమయం కాదని సీఎం జగన్ హితవు పలికారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై ఝార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) గట్టిగా బదులిచ్చింది. జగన్ కంటే ఝార్ఖండ్ సీఎం ఎంతో పరిణతి ఉన్న నేత అని పార్టీ ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య స్పష్టం చేశారు.

స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఆ విధంగా స్పందించినట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఏపీకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని, కానీ కేంద్రం వైఖరితో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.


More Telugu News