ఇంకెంత దోచుకుంటావు మల్లారెడ్డీ... దోచుకున్నది దానం చెయ్!: వీహెచ్
- మంత్రి మల్లారెడ్డిపై వీహెచ్ ధ్వజం
- మల్లారెడ్డి మెడికల్ కాలేజీ చెరువులో ఉందని వెల్లడి
- నిరసనలు తెలిపితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆరోపణ
- అసైన్డ్ భూములను ఆక్రమించుకుంటున్నారని వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మంత్రి మల్లారెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ప్రజలు కరోనాకు బలవుతుంటే, మరోవైపు పేదల అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వ్యాఖ్యానించారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన వైద్య కళాశాల ఓ చెరువులో ఉందని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట నిరసనలు తెలిపితే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. "ఇంకెంత దోచుకుంటావు మల్లారెడ్డీ... దోచుకున్నది దానం చెయ్" అంటూ హితవు పలికారు.
అటు సీఎం కేసీఆర్ పైనా వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కరోనా కంటే అవినీతే ప్రాధాన్యతాంశం అంటున్నాడని, అలాంటప్పుడు ఒక్క ఈటలపైనే కాకుండా ఆరోపణలు వచ్చిన అందరిపైనా విచారణ జరపాలని అన్నారు. సచివాలయాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ కు ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. తమిళనాడులో సీఎం స్టాలిన్ ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు ఇస్తున్నాడని, తెలంగాణలో కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు.