ఏపీలో కరోనా విలయం... ఒక్కరోజులో 96 మంది మృతి
- ఏపీలో కరోనా సెకండ్ వేవ్
- మరింత పెరుగుతున్న మరణాలు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది మృతి
- గత 24 గంటల్లో 20,065 కొత్త కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,87,392
ఏపీలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. విశాఖ జిల్లాలో 2,525 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 2,370 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,269 కేసులు గుర్తించారు. ఒక్క విజయనగరం (650) మినహా అన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 19,272 మంది కరోనా నుంచి కోలుకోగా, 96 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది, విశాఖ జిల్లాలో 12 మంది కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 12,65,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 10,69,432 మంది కోలుకున్నారు. ఇంకా 1,87,392 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 8,615కి చేరింది.