సాక్సులు అమ్ముతున్న పదేళ్ల బాలుడు.. చలించిపోయిన పంజాబ్ సీఎం
- కుటుంబం కోసం చదువు ఆపేసిన బాలుడు
- లుథియానా రోడ్లపై సాక్సుల విక్రయం
- సీఎం కంటబడిన వీడియో
- ఫోన్లో చిన్నారితో మాట్లాడిన వైనం
- రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటన
పదేళ్ల బాలుడు కుటుంబ పోషణ కోసం లుథియానాలో రోడ్డుపై సాక్సులు విక్రయిస్తున్న వీడియో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ను కదిలించింది. కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతుండడంతో వంశ్ సింగ్ అనే ఆ బాలుడు సాక్సులు అమ్ముతున్నాడు. స్కూలు మధ్యలోనే మానేశాడు. ఈ విషయం తెలుసుకున్న సీఎం అమరీందర్ సింగ్ చలించిపోయారు. వెంటనే ఆ బాలుడికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వంశ్ సింగ్ వెంటనే స్కూల్లో చేరేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు ఆయన వంశ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడి అతడి కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. ట్రాఫిక్ లో వంశ్ సింగ్ సాక్సులు అమ్ముతుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా, బాలుడి పరిస్థితి పట్ల చాలామంది విచారం వ్యక్తం చేశారు.
కాగా, బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన సీఎం అమరీందర్ సింగ్... వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. వంశ్ సింగ్ ను చదివించాలని, అందుకయ్యే ఏర్పాట్లు ప్రభుత్వమే చేస్తుందని భరోసా ఇచ్చారు.