ట్విట్ట‌ర్‌లో అందుబాటులోకి కొత్త ఫీచ‌ర్‌!

  • న‌గ‌దు బ‌దిలీల కోసం 'టిప్ జార్' ఫీచ‌ర్
  • ప్ర‌స్తుతం క్రియేట‌ర్లు, పాత్రికేయులు, నిపుణులకు
  • ప్రొఫైల్ పేజీలో ఫాలో బ‌ట‌న్‌కు ప‌క్క‌న 'టిప్ జార్' ఐకాన్  
న‌గ‌దు బ‌దిలీల కోసం 'టిప్ జార్' పేరిట ట్విట్ట‌ర్ కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్ట‌ర్ ఖాతాలు ఉన్న లాభాపేక్ష లేని సంస్థ‌ల‌తో పాటు క్రియేట‌ర్లు, పాత్రికేయులు, నిపుణులకు ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ ప్ర‌యోగాత్మ‌కంగా అందుబాటులోకి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం వీరు మాత్ర‌మే త‌మ‌కు న‌చ్చిన ట్విట్ట‌ర్ ఖాతాదారుల‌కు న‌గ‌దును పంపుకోవ‌చ్చు. అలాగే, ఇత‌రుల నుంచి స్వీక‌రించ‌వ‌చ్చు. భార‌త్‌తో పాటు ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో నేటి నుంచి వారికి ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ట్విట్టర్ ఖాతాలో త‌మ ప్రొఫైల్ పేజీలో ఫాలో బ‌ట‌న్‌కు ప‌క్క‌న టిప్ జార్ ఐకాన్ ఉంటుంద‌ని ట్విట్ట‌ర్ వివ‌రించింది. దాన్ని నొక్కితే పేమెంట్ సేవ‌లు, ప్లాట్‌ఫామ్స్ జాబితా క‌న‌ప‌డుతుంద‌ని, దాని ద్వారా న‌గ‌దు పంపుకోవ‌చ్చ‌ని తెలిపింది.


More Telugu News