హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న 'ఆది పురుష్'

  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్'
  • ప్రభాస్ సరసన కృతి సనన్
  • ముంబై షూటింగులో ఇబ్బందులు
  • హైదరాబాద్ లోనే మేజర్ షెడ్యూల్  
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .. వందల కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మాణం.. బిజినెస్ ఇప్పుడు ఆయన పేరుపై జరుగుతోంది. బాలీవుడ్ లోని బడా దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్ వెంటపడుతున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే 'రాధేశ్యామ్' రొమాంటిక్ లవ్ స్టోరీ చేసిన ప్రభాస్, ప్రస్తుతం యాక్షన్ మూవీ 'సలార్' చేస్తున్నాడు. ఇక తన కెరియర్లోనే తొలి పౌరాణిక చిత్రంగా 'ఆది పురుష్' రూపొందుతోంది. ఓంరౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ప్రభాస్ జాయిన్ కానున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్లు ముంబై స్టూడియోలో వేశారు. అంతేకాదు ముంబై బీచ్ సమీపంలోని ఒక విశాలమైన ప్రదేశంలోను మరికొన్ని సెట్లు వేయాలని భావించారట. అయితే షూటింగుకు వచ్చి వెళ్లాలంటే ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అలా చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అందువలన వేసిన సెట్ల వలన నష్టం వచ్చినా ఫరవాలేదు .. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ కి షిఫ్ట్ చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లు వేయించి .. అక్కడే ఉంటూ మూడు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ చేసి, మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట.


More Telugu News