కొవిడ్‌ నేపథ్యంలో రవీంద్ర జడేజా ప్రత్యేక వీడియో సందేశం!

  • అందరూ ఇంట్లోనే ఉండాలని పిలుపు
  • కలిసికట్టుగా ఉంటేనే మహమ్మారిని జయించగలమని హితవు
  • మాస్కు ధరించాలి, చేతులు శానిటైజ్‌ చేసుకోవాలని సూచన
  • అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని పిలుపు
ప్రతిఒక్కరూ ఇంట్లో ఉంటూ సురక్షితంగా ఉండాలని భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పిలుపునిచ్చాడు. భారత్‌లో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ జడేజా ఓ వీడియో సందేశం విడుదల చేశాడు.

అందరం కలిసి కట్టుగా ఉంటేనే కరోనా మహమ్మారిని జయించగలమని జడేజా అభిప్రాయపడ్డాడు. ఇంట్లోనే ఉంటూ, మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా సురక్షితంగా ఉంచాలని కోరాడు. ఎల్లప్పుడు మాస్కులు ధరించాలని.. తరచూ చేతులు శానిటైజ్‌ చేసుకోవాలని తెలిపాడు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని పిలుపునిచ్చాడు. ఎవరైనా సహాయం అడగడానికి వెనుకాడుతున్నట్లు గమనిస్తే.. మనమే చొరవ తీసుకొని సాయం అందించాలని తెలిపాడు.

ఈ వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్వీట్‌ చేసింది. మరోవైపు పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడడంతో ఐపీఎల్‌ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు.


More Telugu News