25 వేల మంది సినీ కార్మికులకు ఆర్థికసాయం చేయనున్న సల్మాన్ ఖాన్

  • కరోనా కాలంలో సినీ కార్మికుల కష్టాలు
  • నిలిచిపోయిన షూటింగులు
  • ఆదుకోవాలని నిర్ణయించుకున్న సల్మాన్ ఖాన్
  • కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ
  • ఒక్కొక్కరి ఖాతాలో రూ.1,500
కరోనా కష్టకాలంలో సినీ కార్మికులకు కొద్ది మొత్తంలో ఆర్థికసాయం చేయాలని స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నారు. చిత్ర పరిశ్రమలోని 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ మేనేజర్ ఇటీవల సినీ కార్మికుల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్)ను సంప్రదించి, కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను కోరారు. సల్మాన్ బృందం విజ్ఞప్తికి స్పందించిన సినీ కార్మికుల సమాఖ్య తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను అందించింది.

సినీ పరిశ్రమలో రోజువారీ వేతనంపై పనిచేసే కార్మికులు ప్రస్తుతం షూటింగ్ లు లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. సల్మాన్ గతేడాది కూడా కరోనా సమయంలో ఇలాగే ఆర్థికసాయం అందించారు. తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సల్మాన్ ఎప్పటినుంచో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.


More Telugu News