ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్!

  • ప్ర‌భుత్వ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం
  • రేష‌న్ కార్డు ఉన్న దాదాపు రెండు కోట్ల కుటుంబాల‌కు రూ.4 వేలు
  • క‌రోనా ఆర్థిక సాయం కింద ప్ర‌క‌ట‌న‌
  • లీట‌రు పాలపై రూ.3 తగ్గింపు
తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. తొలి రోజే ఆయ‌న కీల‌క ఉత్త‌ర్వుల‌పై సంత‌కాలు చేశారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. క‌రోనా వేళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ప్ర‌క‌టించిన వ‌రాలు ఉపశ‌మ‌నం క‌లిగించేలా ఉన్నాయి. ప్ర‌భుత్వ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణించే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు.

రేష‌న్ కార్డు ఉన్న దాదాపు రెండు కోట్ల కుటుంబాల‌కు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సాయాన్ని కొవిడ్ ఆర్థిక‌ సాయం కింద ఇస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ఇందులో భాగంగా తొలి విడ‌త కింద త్వ‌ర‌లో రూ.2 వేల చొప్పున జ‌మ చేస్తామ‌ని తెలిపారు. అంతేకాదు, త‌మిళ‌నాడు వ్యాప్తంగా లీట‌రు పాల‌పై రూ.3 త‌గ్గిస్తూ త‌మిళ‌నాడు కొత్త‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు.


More Telugu News