'అఖండ' వచ్చేది అప్పుడేనట!
- బోయపాటితో బాలయ్య మూడో మూవీ
- టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ ఈ నెల 28
- సెప్టెంబర్ కి వాయిదా అనే టాక్
బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో 'అఖండ' రూపొందుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రైతు గానూ .. అఘోరగాను కనిపించనున్నారు. ఏ పాత్ర నుంచి ఆయన ఏ పాత్ర వైపుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్లు పడటం వలన, సహజంగానే ఈ సినిమాపైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన టీజర్, రికార్డుస్థాయిలో వ్యూస్ ను రాబట్టుకుంది.
నిజానికి ఈ సినిమాను ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం కలగడం వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించలేదుగానీ, సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది చూడాలి. బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, మరో నాయికగా పూర్ణ కనిపించనుంది.