'ఆర్ఆర్ఆర్'లో హైలైట్ గా యాక్షన్ ఎపిసోడ్!
- 400 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం
- ప్రతి అంశంలోను ప్రత్యేకత
- 20 నిమిషాల యాక్షన్ సీన్
- అభిమానుల్లో మరింత ఉత్సాహం
ఇటు ఎన్టీఆర్ అభిమానులు .. అటు చరణ్ ఫ్యాన్స్ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ .. చరణ్ లుక్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ప్రత్యేకతలు చోటుచేసుకోవడమే అందుకు కారణం.
అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పాత్రలు ఇప్పటికే అభిమానులకు కనెక్ట్ అయ్యాయి. అందువలన ఆ పాత్రలను పూర్తిస్థాయిలో చూడటానికి వాళ్లంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్ ను ఎంతో ఇంట్రెస్ట్ తో ఫాలో అవుతున్నారు.
400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, ప్రతి అంశం విస్మయులను చేస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అల్లూరి పోరుబాట .. కొమరం భీమ్ ఉద్యమ బాట వేరు వేరుగా కనిపిస్తూ వెళతాయి. ఒకానొక సందర్భంలో ఇద్దరూ ఒకటై శత్రువులపై విరుచుకుపడతారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరపై దాదాపు 20 నిమిషాల పాటు సాగుతుందట. ఇది ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. చరణ్ .. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించేలా ఈ ఎపిసోడ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ సంచలనానికి సరైన అర్ధం చెప్పేలానే కనిపిస్తోంది.