తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసిన టీఎస్‌ఆర్టీసీ!
- రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి
- ఏపీలో కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలు
- అందుకే బస్సు సర్వీసులను నిలిపివేశామన్న టీఎస్‌ఆర్టీసీ
- ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులపైనా ప్రభావం
- ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో వ్యాప్తి నివారణకు ఏప్రీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఉదయం తెలంగాణ నుంచి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి ఏపీలో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం లేదని..ఈ నేపథ్యంలోనే అనివార్యమై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
అయితే, అత్యవసర వాహనాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని సునీల్ శర్మ తెలిపారు. అలాగే ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులనూ నిలిపివేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.