ఆనంద్ దేవరకొండ హీరోగా 'హైవే' మూవీ ప్రారంభం!
- సీనియర్ సినిమాటోగ్రాఫర్ గా గుహన్ కు పేరు
- దర్శకుడిగా గుహన్ తొలి సినిమా '118'
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- త్వరలో మిగతా వివరాలు
విజయ్ దేవరకొండ సోదరుడిగా ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, అన్నకి పూర్తి భిన్నమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ వెళుతున్నాడు. 'దొరసాని' సినిమాలో పేదింటి ప్రేమికుడైన 'రాజు' పాత్రలో ఒదిగిపోయిన ఆయన, ఆ తరువాత 'మిడిల్ క్లాస్ మెలోడీస్' లోను సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం 'పుష్పక విమానం' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలా ఒక కథకి మరో కథకి ఎంతమాత్రం పోలికలేనివి చేసుకుంటూ వెళుతున్న ఆయన, తాజాగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు .. ఆ సినిమా పేరే .. 'హైవే'.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాకి 'గుహన్' దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీఐశ్వర్యలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, కొంత సేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆనంద్ దేవరకొండపై ఎమ్మెల్యే జి. కిషోర్ కుమార్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వీరభద్రం ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. కరోనా ఉద్ధృతి తగ్గిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. గుహన్ .. సీనియర్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో '118' సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన ఆయన, ఆ తరువాత చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ కంటెంట్ ను తెరపై ఆయన ఒక రేంజ్ లో ఆవిష్కరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.