కరోనా వ్యాక్సినేషన్ పై ఈ నెల 8న నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు

  • టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • వ్యాక్సినేషన్ తీరుపై చంద్రబాబు అసంతృప్తి
  • టీకాలు వేయండి-ప్రాణాలు కాపాడండి నినాదాలతో నిరసనలు
  • దేశంలో 33 జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్న చంద్రబాబు
  • వాటిలో 7 జిల్లాలు ఏపీలోనివేనని వ్యాఖ్య  
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన ఈవేళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 'టీకాలు వేయండి... ప్రాణాలు కాపాడండి' అనే నినాదాలతో నిరసనలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలో కరోనా అధికంగా ఉన్న 33 జిల్లాల్లో 7 జిల్లాలు ఏపీలోనే ఉన్నాయని అన్నారు. వ్యాక్సిన్ తప్ప కరోనా నియంత్రణకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం 13 లక్షల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చిందని ఆరోపించారు. అటు, చంద్రన్న బీమా ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు వచ్చేవని తెలిపారు. కరోనా నియంత్రణపై సూచనలు చేస్తుంటే తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ పెద్దలపై ధ్వజమెత్తారు. 


More Telugu News