అజిత్ సింగ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చిరంజీవి
- కరోనాతో కన్నుమూసిన అజిత్ సింగ్
- అజిత్ సింగ్ తో అనుబంధాన్ని స్మరించుకున్న చిరంజీవి
- ఇద్దరం కేంద్ర మంత్రులుగా పనిచేశామని వెల్లడి
- అజిత్ సింగ్ రైతు పక్షపాతి అని వివరణ
కేంద్ర మాజీ మంత్రి, ఆర్ఎల్ డీ పార్టీ అధినేత అజిత్ సింగ్ (82) కరోనా బారినపడి కన్నుమూశారు. అజిత్ సింగ్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతంలో తనతో పాటు అజిత్ సింగ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో సేవలు అందించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
అజిత్ సింగ్ రైతు పక్షపాతి అని చిరంజీవి కొనియాడారు. విమానయాన మంత్రిగా, ఆర్ఎల్ డీ పార్టీ అధినేతగా సమూల సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.