ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై హైకోర్టు అసంతృప్తి

  • ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో పడకల లభ్యతపై విచార‌ణ‌
  • ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఫీజుల వసూళ్లపై కూడా..
  • క‌రోనా క‌ట్ట‌డికి స‌రైన చ‌ర్య‌లు తీసుకోవట్లేద‌న్న‌ హైకోర్టు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ విప‌రీతంగా వున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో పడకల లభ్యతతో పాటు ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఫీజుల వసూళ్ల వంటి అంశాల‌పై  హైకోర్టులో విచారణ కొన‌సాగుతోంది. సామాజిక కార్య‌క‌ర్త తోట సురేశ్ బాబుతో పాటు ప‌లువురు వేసిన పిటిష‌న్లు విచార‌ణ‌కు వ‌చ్చాయి.  

క‌రోనా నియంత్ర‌ణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవట్లేద‌ని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేదని మొన్న ప్ర‌భుత్వం  అఫిడవిట్‌లో పేర్కొంద‌ని, ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులే చెబుతున్నారని  హైకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ అఫిడవిట్‌లో వివ‌రించిన దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ కోసం తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది హైకోర్టుకు వివ‌రిస్తున్నారు.


More Telugu News