మరోసారి ఫ్యాక్షనిస్టుగా కనిపించనున్న బాలయ్య!
- ఫ్యాక్షన్ లీడర్ గా దుమ్మురేపేసిన బాలయ్య
- మళ్లీ ఆ తరహా పాత్రలో కనిపించనున్న వైనం
- గోపీచంద్ మలినేని డిఫరెంట్ గా డిజైన్ చేసిన పాత్ర
- బాలయ్య పుట్టిన రోజున లాంచ్
ఫ్యాక్షన్ సినిమాల జోరు సాగుతున్న సమయంలో చాలామంది హీరోలు అలాంటి నేపథ్యంలో సాగే సినిమాలనే చేస్తూ వెళ్లారు. కానీ వాళ్లలో బాలకృష్ణ ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడిన సినిమాల్లో బాలకృష్ణ విజృంభించారు. ఆ సినిమాలు ఆయనకి భారీ విజయాలతో పాటు, రికార్డుస్థాయి వసూళ్లను కూడా తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన ఈ జోనర్ లో సినిమా చేయలేదు. కానీ గోపీచంద్ మలినేని మూవీలో ఆయన ఫ్యాక్షనిజం మళ్లీ జూలు విదల్చనుందని అంటున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారట. అలా ఆయన కొంతసేపు ఫ్యాక్షన్ లీడర్ గా పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. ఈ పాత్రను ఆయన క్రేజ్ కి తగిన విధంగా గోపీచంద్ మలినేని డిజైన్ చేశాడని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా, ఒక కథానాయికగా రాయ్ లక్ష్మీ ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.