ఏపీలో 7వ తరగతికి సీబీఎస్ఈ సిలబస్... ఈ ఏడాది నుంచే అమలు!
- రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు క్యాబినెట్ ఆమోదం
- పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యావిధానం
- దశల వారీగా విస్తరణ
- సీబీఎస్ఈ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఏపీ
ఏపీ పాఠశాలల్లో సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికతో విద్యాబోధన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది నుంచే తొలి అడుగు వేయాలని సీఎం జగన్ సంకల్పించారు. మొదటగా 7వ తరగతిలో సీబీఎస్ఈ విద్యావిధానం అమలు చేయనున్నారు. ఆపై దశల వారీగా సెంట్రల్ సిలబస్ ను మిగతా తరగతులకు కూడా వర్తింపజేస్తారు.
ఈ మేరకు సీబీఎస్ఈ బోర్డుతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏపీలో విద్యాప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా విద్యారంగంలో సంస్కరణలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024-25 విద్యాసంవత్సరం నాటికి పదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యాబోధన అమల్లోకి తీసుకురావాలన్నది ఏపీ ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది.