వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.90.99
- డీజిల్ ధర రూ.81.42
- హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.94.57
- డీజిల్ ధర రూ.88.77
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం అందరూ ఊహించినట్లుగానే మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు లీటరు పెట్రోలు ధర రూ.90.99గా ఉండగా, డీజిల్ ధర రూ.81.42గా ఉంది.
నిన్నటితో పోల్చితే లీటరు పెట్రోలు ధర 25 పైసలు, డీజిల్ ధర 30 పైసలు పెరిగింది. ముంబైలో ఈ రోజు లీటరు పెట్రోలు ధర రూ.97.34, డీజిల్ ధర రూ.88.49గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.92.90గా, డీజిల్ ధర రూ.86.35గా ఉంది.
ఇక కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.91.14, డీజిల్ ధర రూ.84.26కి చేరింది. అలాగే, హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ఈ రోజు 23 పైసలు పెరిగి రూ.94.57గా ఉండగా, డీజిల్ ధర 31పైసలు పెరిగి రూ.88.77గా ఉంది.