వైన్ షాపుల ముందు భారీ క్యూ.. ఫొటో పోస్ట్ చేసి ఏపీ సర్కారుపై బుచ్చయ్య చౌదరి విమర్శలు
- రేషన్ కి ఇదే పరిస్థితి... ఇప్పుడు వ్యాక్సిన్ కి ఇదే పరిస్థితి
- అది చాలదు అన్నట్లు వైన్ షాప్ ల ముందు దుస్థితి
- ప్రభుత్వం ప్రకటనలు గొప్ప, పనితనం మాత్రం దిబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రేషన్ కి ఇదే పరిస్థితి... ఇప్పుడు వ్యాక్సిన్ కి ఇదే పరిస్థితి. అది చాలదు అన్నట్లు వైన్ షాప్ ల ముందు దుస్థితి. నేను ఉన్నాను...నేను విన్నాను.. కానీ ఏవి కనపడవు అంతేనా ముఖ్యమంత్రి జగన్ గారు!' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. వైన్ షాప్ ముందు భారీ క్యూకి సంబంధించిన ఫొటోను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు.
రేషన్ డోర్ డెలివరీపై కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. 'ప్రభుత్వం ప్రకటనలు గొప్ప, పనితనం మాత్రం దిబ్బ అన్నట్లు ఉంది. రేషన్ డోర్ డెలివరీ చేసే వారికి కనీస రక్షణ కల్పించలేక పోవడం దారుణం. ఫేస్ షీల్డ్, పిపిఈ కిట్లు ఇవ్వకపోవడం ఇన్సూరెన్స్ చేయించకపోవడం దారుణం. ఈ రోజు రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో వ్యాన్ డ్రైవర్లు ఆందోళనలు చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించాలి' అని గోరంట్ల ట్వీట్ చేశారు.