జమ్మూ కశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్... ముగ్గురు టెర్రరిస్టుల హతం
- షోపియాన్ జిల్లాలో కాల్పులు
- ఓ ప్రాంతంలో నక్కిన టెర్రరిస్టులు
- లొంగిపోవాలని విజ్ఞప్తి చేసిన భద్రతా బలగాలు
- కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు
- దీటుగా స్పందించిన భద్రతా దళాలు
జమ్మూ కశ్మీర్ లో పాకిస్థాన్ ప్రోద్బలిత ఉగ్రవాదులపై మరోసారి భద్రతా దళాలదే పైచేయి అయింది. షోపియాన్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలు ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చాయి. ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు దాగిన ప్రదేశాన్ని చుట్టుముట్టి, లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
కానీ ముష్కరులు మొదట ఓ గ్రనేడ్ విసిరి, ఆపై కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు దీటుగా స్పందించాయి. అనంతరం, ఘటన స్థలంలో ముగ్గురు టెర్రరిస్టుల మృతదేహాలను గుర్తించారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు.
కాగా, కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులను అల్ బదర్ సంస్థకు చెందినవారిగా భావిస్తున్నారు. వీరందరూ స్థానికులేనని, ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరారని పోలీసులు తెలిపారు. కాగా, ఒక ఉగ్రవాది లొంగిపోయినట్టు సమాచారం.