కరోనాతో కన్నుమూసిన ఎన్‌ఎస్‌జీ గ్రూప్ కమాండర్.. దళంలో తొలి కరోనా మరణం

  • ఆసుపత్రి ఐసీయూలో పనిచేయని వెంటిలేటర్
  • మరో ఆసుపత్రిలో వెంటిలేటర్ బెడ్ కోసం వెతుకులాట
  • ఆ తర్వాత కార్డియాక్ అంబులెన్స్ దొరకడంలో ఆలస్యం
  • అన్నీ కుదిరి ఆసుపత్రికి తరలించే లోపే మృతి
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ)లో తొలి కరోనా మరణం సంభవించింది. ఇటీవల కరోనా బారినపడిన ఆ దళం కోఆర్డినేషన్ గ్రూప్ కమాండర్ బీకే ఝా (53) చికిత్స పొందుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు.

అంతకుముందు రోజు రాత్రి ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న వెంటిలేటర్ పనిచేయలేదు. వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఆసుపత్రిలో చేర్పించాలని ఆసుపత్రి వైద్యులు సూచించారు. దీంతో వెంటిలేటర్ బెడ్ కోసం వెతగ్గా చివరికి నోయిడాలోనే మరో ఆసుపత్రిలో బెడ్ దొరికింది. అయితే, అక్కడికి తరలించేందుకు కార్డియాక్ అంబులెన్స్ దొరకడంలో మరింత ఆలస్యం జరిగింది. అన్నీ కుదిరి ఝాను ఆసుపత్రికి తరలించే సరికి ఆయన ప్రాణాలు కోల్పోయారు. చికిత్సలో అంతరాయం వల్లే ఆయన మరణించారని ఎన్‌ఎస్‌జీ అధికారులు ఆరోపించారు.


More Telugu News