భారత్‌కు బయలుదేరిన మరో మూడు రాఫెల్ యుద్ద విమానాలు
- 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం రూ. 58 వేల కోట్లతో ఒప్పందం
- ఇప్పటికే పలు విమానాల రాక
- శత్రు దుర్భేద్యంగా భారత వాయుసేన
ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న అత్యంత అధునాతన రాఫెల్ విమానాలు మరో మూడు నిన్న భారత్‌కు బయలుదేరాయి. ఈ మూడింటితో కలుపుకుని భారత వాయసేనలో ఈ యుద్ధ విమానాల సంఖ్య 21కి చేరుకుంటుంది.
తాజా విమానాలు భారత్ చేరుకున్న తర్వాత ఏఏఎఫ్‌లోని రాఫెల్ యుద్ధ విమానాలు రెండో స్క్వాడ్రన్‌లో చేరుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని హసిమరా వైమానిక స్థావరంలో ఈ కొత్త స్క్వాడ్రన్ ఉంటుందని అధికారులు తెలిపారు. 18 యుద్ధ విమానాలతో కూడిన రాఫెల్ తొలి స్క్వాడ్రన్ అంబాలా వైమానిక స్థావరంలో ఉంది. భారత వాయుసేనను మరింత పటిష్ఠం చేసే ఉద్దేశంతో సెప్టెంబరు 2016లో 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 58 వేల కోట్లు.