'మమత బెనర్జీ ఈ దేశ నాయకురాలు' అంటూ కితాబునిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత
- మోదీ సహా సీబీఐ వంటి సంస్థలను మట్టికరిపించారు
- ఎంతో పోరాడి ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు
- బెంగాల్ హింసకు బీజేపీనే కారణమన్న కమల్ నాథ్
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ సహా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా ఆమె మట్టికరిపించారని అన్నారు. మమత ఈరోజు దేశ నాయకురాలిగా ఎదిగారని చెప్పారు. బెంగాల్ కు వరుసగా మూడోసారి సీఎం అయ్యారని... అత్యంత కఠినమైన పోరు తర్వాత ఆమె ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు.
మమత చేసిన పోరాటం చాలా గొప్పదని.. మోదీ సహా, ఆయన మంత్రులు, సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో కూడా ఆమె పోరాడారని కమల్ నాథ్ చెప్పారు. అందరినీ ఆమె తరిమికొట్టారని ప్రశంసించారు. బెంగాల్ లో హింస జరుగుతోందంటూ బీజేపీ ఆరోపిస్తోందని... చేస్తున్నదంతా బీజేపీనే అని మండిపడ్డారు. ఇలాంటి హింసాత్మక మార్గాలను ఎంచుకోవడం చాలా తప్పని అన్నారు. తాను మమతతో ఫోన్ లో మాట్లాడానని... హింసకు దూరంగా ఉండాలని అందరికీ చెప్పాలని సూచించానని తెలిపారు. మధ్యప్రదేశ్ కు రావాలని మమతను కోరానని చెప్పారు.